Sunday, April 21, 2024

బ్ర‌హ్మాస్త్రం – ర‌ణ‌బీర్ , ఆలియాల పోస్ట‌ర్ రిలీజ్

బాలీవుడ్ భారీ బ‌డ్జెట్ మూవీ బ్ర‌హ్మ‌స్త్ర‌. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కానుంది. బ్ర‌హాస్త్రం ..శివం మొద‌టి భాగంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నేడు శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా తెలుగు పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. భగభగమండుతోన్న సూర్య గోళం నడుమ రణబీర్ కపూర్-అలియాభట్ మధ్య రొమాన్స్ ఆసక్తికరం. పోస్టర్ లో హీరో..హీరోయిన్ ఇద్దరికి భారీ గాయాలైనట్లు తెలుస్తోంది. మరి శివంలో వీరిద్దరి పోరాటం ప్రేమ కోసమా.. లేదా.. అంతకు మించి ఇంకేమైనా.. ఉందా.. అన్నది తెలియాలి. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రాక్ స్టార్ రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిన్నారు. వీరితో పాటు ప‌లువురు స్టార్లు నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు..తమిళ్..మలయాళం..కన్నడ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు.తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. దీంతో సినిమాకి తెలుగు నుంచి పెద్ద ఎత్తున ప్రమోషన్ లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని పనులు పూర్తిచేసి థియేటర్లో సెప్టెంబర్ 9న ఇదే ఏడాది భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్-ధర్మ ప్రొడక్షన్స్- ప్రైమ్ ఫోకస్.. స్టార్ లైట్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇందులో మూనీ రాయ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement