Thursday, May 2, 2024

Spl Story  | మెదడు తినే బ్యాక్టిరియా.. అతిగా ఈతకొట్టినా ప్రాణాలకు ముప్పే!

చెరువులు, కాలువలు, కుంటల్లో సరదాగా ఈతకొట్టే వారికి ఇది హెచ్చరిక వంటిదే. ఎందుకంటే నిత్యం చెరువులు, కాలువల్లో స్నానం చేయడం వల్ల మంచికంటే చెడే ఎక్కువగా జరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు. దీనికి ఓ ఎగ్జాంపుల్​ని కూడా చూపిస్తున్నారు. ఈ మధ్యనే కేరళ రాష్ట్రంలో ఓ 15 ఏండ్ల బాలుడు రోజూ నీటిలో ఈత కొట్టడం వల్ల చనిపోయాడు. అతనికి ఓ అరుదైన వ్యాధి సోకింది. దాని పేరు నెగ్లేరియాగా (అమీబా వల్ల వచ్చే వ్యాధి) కనుగొన్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేరళలోని అలప్పుజా జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అరుదైన బ్రెయిన్​ ఇన్​ఫెక్షన్​తో చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమీబా సోకడం ద్వారా ఆ బాలుడు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడు. దాంతో మరణం సంభవించింది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అని ఈ వ్యాధిని పిలుస్తారు. ఈ ఇన్​ఫెక్షన్ నెగ్లేరియా ఫౌలెరి వల్ల వస్తుంది. పనయ్వల్లి గ్రామానికి చెందిన బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న (గురువారం) సాయంత్రం చనిపోయాడు.

వారం రోజుల క్రితం సాధారణ జ్వరం రావడంతో స్థానిక వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో దగ్గర్లోని మెడికల్​ కాలేజీకి తరలించగా ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు గుర్తించారు. ఇక.. ఆ బాలుడు తన ఇంటికి సమీపంలోని నీటి ప్రవాహంలో క్రమం తప్పకుండా స్నానం చేసేవాడు. ఆ నీళ్ల నుంచి అతనికి నైగ్లేరియా సోకినట్లు డాక్టర్లు తెలిపారు.

నేగ్లేరియా అంటే ఏమిటి?

- Advertisement -

నేగ్లేరియా అనేది అమీబా, ఏకకణ జీవి ద్వారా మానవులకు సోకుతుంది. మొదట 1965లో ఆస్ట్రేలియాలో ఈ వ్యాధిని కనుగొన్నారు. సాధారణంగా నదులు, సరస్సులలో ఈ రకం బ్యాక్టీరియా కనిపిస్తుంది. అంతేకాకుండా మట్టి, వెచ్చని మంచినీటిలో కూడా అమీబా నివసిస్తుంది. సాధారణంగా ఈత కొట్టినప్పుడు లేదా డైవ్ చేసినప్పుడు కానీ, మంచినీటి శరీరంలో తలని ముంచినప్పుడు కానీ, ముక్కు ద్వారా అమీబా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. అప్పుడు అమీబా ముక్కునుంచి లోపలి వెళ్లి మెదడు వాపునకు కారణమవుతుంది. మెల్ల మెల్లగా మెదడు కణజాలాలను దెబ్బతీస్తుంది.

మెదడు తినే ఇన్​ఫెక్షన్​ లక్షణాలు ఏమిటి?

ప్రారంభ దశలో లక్షణాలు:

1. వాంతులు

2. వికారం

3. జ్వరం

4. తలనొప్పి

వ్యాధి సోకిన వారికి తరువాతి దశలో ఈ లక్షణాలుంటాయి..

1. శ్రద్ధ లేకపోవడం

2. మూర్ఛ

3. భ్రాంతి

4. గందరగోళం

5. మానసిక స్థితిలో మార్పు

6. మెడ గట్టిగా మారడం

7. కోమా వంటి స్థితి

అంతేకాకుండా కొన్నిసార్లు రోగులు మురికి నీటితో ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement