Wednesday, May 1, 2024

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కు గుండెపోటు

విశ్వసుందరి, బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ కు గుండెపోటు వచ్చింది. సుస్మితా సేన్ ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఈమెకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. సుస్మిత సేన్ హార్ట్ ఎటాక్ భారిన పడినట్లు వెల్లడించింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

” నేను కొన్ని రోజుల క్రితం హార్ట్ ఎటాక్ తో బాధపడ్డాను. డాక్టర్లు నాకు యాంజియోప్లాస్టి చేశారు. ప్రస్తుతం నా పరిస్థితి బాగానే ఉంది. నేను మళ్ళీ కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. మిస్ యూనివర్స్ గా గెలిచిన సుస్మితసేన్ 1996లో దస్తక్ అనే హిందీ చిత్రం ద్వారా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. ఆపై బాలీవుడ్‌ లో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement