Thursday, May 16, 2024

రోడ్డుపై రెడ్​ సూట్​కేస్.. ఓపెన్​ చేస్తే డెడ్​బాడీ లభ్యం

పంజాబ్​ రాష్ట్రం జలంధర్ రైల్వే స్టేషన్‌లో దగ్గర ఇవ్వాల (మంగళవారం) ఓ ఎర్రటి సూట్‌కేస్‌ కనిపించింది. అనుమానాస్పందంగా ఉండడంతో అటుగా వెళ్తున్న వ్యక్తి దాని దగ్గరగా వెళ్లి చూశాడు. అయితే అతనికి ఆ సూట్​కేస్​ నుంచి ఒక మనిషి కాలు బయటికి వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్​ తిన్నాడు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మంగళవారం ఉదయం పంజాబ్​ రాష్ట్రం జలంధర్​ రైల్వే స్టేషన్ ఆవరణలో  ఓ ఎర్రటి సూట్‌కేస్‌ను ఓ బాటసారి గమనించాడు. చాలాసేపటి నుంచి ఆ సూట్​కేసును ఎవరూ తీసుకెళ్లకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. సూట్‌కేస్‌ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో దగ్గరికి వెళ్లి చూశాడు. దానిలో నుంచి  కాలు బయటికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.

ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసు బృందం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ డెడ్​బాడీ ఎవరిది, అక్కడ ఎవరు పడేశారన్న విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement