Monday, April 29, 2024

Bharat Jodo: కాంగ్రెస్​పై కాపీరైట్​ యాక్ట్​.. భారత్​ జోడో ట్విట్టర్​ క్లోజ్​ చేయాలన్న హైకోర్టు

కాంగ్రెస్​ పార్టీని కాపీరైట్​ చట్టం వెన్నాడుతోంది. అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమా పాటను వాడారు. దీంతో ఒక సంగీత సంస్థ కాంగ్రెస్‌పై కాపీరైట్ కేసు దాఖలు చేసింది. కాగా, దీనిపై బెంగళూరు కోర్టు కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఇవ్వాల (సోమవారం) ఆదేశించింది.

MRT సంస్థ నిర్వాహకుడు నవీన్ కుమార్ భారత జోడో యాత్రలో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టుకు వెళ్లారు. సూపర్‌హిట్ కన్నడ చిత్రం KGF-2 నుండి ఓ పాటను కాపీకొట్టారని ఆరోపిస్తూ రాహుల్​ గాంధీతో సహా ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. పొరుగున ఉన్న తెలంగాణకు వెళ్లడానికి ముందు కర్నాటకలో భారత్ జోడో యాత్రలో ఈ పాటను ప్లే చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది.

బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో పోలీసులకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్‌ఐఆర్ దాఖలు అయ్యింది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అనుమతి లేకుండా కెజిఎఫ్ -2 నుండి ఫేమస్​ సాంగ్​ని ఉపయోగించిన రెండు వీడియోలను ట్వీట్ చేశారని మ్యూజిక్ కంపెనీ పేర్కొంది. భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యాత్ర ముగించుకుని మహారాష్ట్రకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement