Thursday, May 9, 2024

మౌంట్ ఎవ‌రెస్ట్ ఎక్కిన అంధుడు.. రికార్డ్ నెల‌కొల్పిన ర‌ఫా జేమి

ఓ అంధుడు మౌంట్ ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని ఎక్కాడు. దాంతో ఎవ‌రెస్టుని అధిరోహించిన తొలి అంధుడిగా మెక్సికోకి చెందిన ర‌ఫా జేమి రికార్డ్ ని క్రియేట్ చేశాడు. సెవ‌న్ స‌మ్మిట్ ట్రెక్స్ ఎక్స్‌పెడీష‌న్ డైరెక్ట‌ర్ చాంగ్ ద‌వా షెర్పా దీనిపై స్పందిస్తూ త‌న స్నేహితుడు జెస్మాన్ త‌మాంగ్‌తో క‌లిసి ర‌ఫా .. ఎవ‌రెస్టును ఎక్కిన‌ట్లు తెలిపారు. సెవ‌న్ స‌మ్మిట్ ట్రెక్స్‌కు చెందిన గైడ్స్ కూడా ర‌ఫా జేమితో క‌లిసి ఎవ‌రెస్టు ఎక్కారు. స్నేహితుడు ఒమ‌ర్ అల్వ‌రేజ్‌తో క‌లిసి ర‌ఫా మౌంట్ ఎవ‌రెస్టు అధిరోహించాడు. ర‌ఫాకు కంటి చూపు లేకున్నా.. ప‌ర్వ‌తారోహ‌ణ‌లో అత‌ను ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు చాంగ్ ద‌వా తెలిపారు. ఒమ‌ర్‌, ర‌ఫాలు త‌మ స్నేహంలోని శ‌క్తిని చాటార‌న్నారు. కోరిక‌, ప‌ట్టుద‌ల‌, ఆత్మ‌విశ్వాసం ఉంటే.. సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండ‌ద‌ని ర‌ఫా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement