Tuesday, April 30, 2024

Top Story : దళిత ఓటు బ్యాంకుపై కన్నేసిన బీజేపీ

దళిత ఓటు బ్యాంకుపై కన్నేసిన బీజేపీ మరో అడుగు ముందుకేసింది. దళిత సామాజిక వర్గంలో అత్య ధికంగా ఉన్న మాది గలు, ఉప కులాల ఓటర్ల మనసు గెలవ కుండా తెలంగాణలో అధికా రం చేపట్టడం అసాధ్య మని భావిస్తున్న బీజేపీ వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎప్పటి కప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోంది.

తాజాగా ఎన్నికల ప్రచా రానికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణ మాదిగను బీజేపీ రంగంలోకి దించాలని నిర్ణయించింది. దళితుల ఓట్లు బీజేపీకి పడేలా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయనతో సభలు నిర్వహిం చాలని భావిస్తోంది. అందులో భాగంగా మందకృష్ణ మాదిగకు ప్రత్యే కంగా ఒక హెలికాప్టర్‌ను కేటాయిం చాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 నుంచి మూడు రోజులపాటు- పలు జిల్లాల్లో మందకృష్ణ మాదిగతో బహిరంగ సభలకు ప్లాన్‌ చేసింది. ఈనెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మందకృష్ణ మాదిగ పర్యట నలు కొనసాగనున్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లాతో పాటు- వరంగల్‌ జిల్లాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్‌ చేసుకుంది. కాగా దళితుల్లో మెజా రిటీ సామాజికవర్గమైన మాదిగల ఓట్లపై బీజేపీ కన్నే సింది. మాదిగలు, ఉపకులాల ఓట్లతో రాష్ట్రంలోని 19 ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీట్లలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకో వాలని వ్యూ హం రచిం చింది. ఈ 19 ఎస్సీ రిజర్వ్‌ స్థానాల్లోని మెజారిటీ సీట్లను ఏ పార్టీ గెలుచుకుంటే తెలంగా ణలో ఆ పార్టీనే అధికారం లోకి వస్తున్న నేపథ్యంలో రిజర్వ్‌ సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 19 ఎస్సీ రిజర్వ్‌ డ్‌ స్థానాలుం డగా జనరల్‌ లో మరో రెండు స్థానాలను కేటాయించి దళితు లకు పెద్ద పీట వేశామని బీజేపీ ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా మాదిగ విశ్వరూప మహాసభలో మోడీ వర్గీక రణ విషయంలో అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాదిగలు, ఉపకులాల ఓట్లన్నీ బీజేపీ వైపు పడేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే మాదిగలు, ఉపకులాల ఓట్లు గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లించేలా మందకృష్ణ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ అగ్రనేతలు ఎమ్మార్పీఎస్‌ నేతలతో వరుస భేటీ- అవుతున్నారు. ఇప్పటికే అమిత్‌ షాతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎమ్మార్పీఎస్‌ నేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. అసెంబ్లిd ఎన్నికల నేపథ్యంలో మాదిగ సామాజికవర్గ ఓట్లు బీజేపీకి పడేలా ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు దళిత బందు పథకం వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్‌ వ్యతిరేక దళితులను సైతం బీజేపీ ఆకట్టు-కునే చర్యలు చేపడుతుంది. తెలంగాణలో ఉన్న దళితుల్లో మెజారిటీ- వర్గం మాదిగ సామాజిక వర్గం. ఎస్సీ రిజర్వ్‌ నియోజికవర్గాల్లో మాత్రమే కాకుండా జనరల్‌ స్థానాల్లో కూడా వారి ప్రభావం ఉంది. అందుకోసమే బీజేపీ మాదిగ సామాజికవర్గ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు సానుకూలత వ్యక్తం చేయడంతో అదే సభలో మందకృష్ణ మాదిగ తమ మద్దతు బీజేపీకేనని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement