Monday, April 29, 2024

సీఎం కేసీఆర్ కి బ‌ర్త్ డే విషెష్ తెలిపిన – అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ‌

తెలంగాణ సీఎం కేసీఆర్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ‌. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాత కామాఖ్య మరియు మహాపురుష్ శ్రీమంత శంకర్‌దేవ్ మీకు మంచి ఆరోగ్యం , దీర్ఘాయువును ప్రసాదించుగాక’’ అంటూ ట్విట్ చేశారు. ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బిశ్వశర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. టీ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. మరోవైపు సర్జికల్ స్ట్రైక్ పై తను అనుమానాలు ఉన్నాయంటూ… ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement