Friday, May 17, 2024

అన్ని వైర‌స్ ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి – బిల్ గేట్స్

ఒమిక్రాన్ అత్యంత‌వేగంగా వ్యాపిస్తుంద‌ని మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు బిల్ గేట్స్ అన్నారు. ఒమిక్రాన్ ప్ర‌తి ఇంటికి చేరుతుంద‌ని అన్నారు. త‌న స‌న్నిహితులు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నార‌న్నారు. ఒమిక్రాన్ మ‌హ‌మ్మారి వ‌ల్ల చెత్త ద‌శ‌ను చూస్తున్నామ‌ని చెప్పారు. ఈ మేర‌కు త‌న హాలిడే ప్లాన్స్ ని క్యాన్సిల్ చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. చరిత్రలో అన్ని వైరస్ ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని బిల్ గేట్స్ చెప్పారు.

ఒమిక్రాన్ మనల్ని ఎంత అనారోగ్యానికి గురి చేస్తుందనేది ఇప్పటి వరకు తెలియదని… దాని గురించి పూర్తిగా తెలిసేంత వరకు ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పారు. ఎవరూ గుంపులుగా గుమికూడొద్దని సూచించారు. టీకాలు వేయించుకోవాలని, వ్యాక్సిన్ బూస్టర్ డోసు మరింత రక్షణను కల్పిస్తుందని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయని అన్నారు. అయితే 2022 నాటికి కరోనా మహమ్మారి ముగుస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు. కాగా ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల‌న్నింటికి వ్యాపిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement