Friday, May 3, 2024

బిగ్ బాస్6 – ఆ కంటెస్టెంట్ వ‌ద్ద‌న్న ‘నాగార్జున‌’

డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో ప్రారంభంకానుంది బిగ్ బాస్ షో. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్లు న‌డిచాయి. ఇప్పుడు ఆరో సీజ‌న్ ప్రారంభం కానుందని షో నిర్వాహ‌కులు తెలిపారు. కాగా ఫిబ్ర‌వ‌రిలో ఈ సీజ‌న్ ని ప్ర‌సారం చేయ‌నున్నార‌ట‌. కాగా ఈ సీజ‌న్ కోసం ప‌లువురు కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసిన‌ట్లు టాక్ వ‌చ్చింది. ఈ క్రమంలో జబర్దస్త్ షోకి సంబంధించి కంటెస్టెంట్ లను గత సీజన్లలో షో నిర్వాహకులు తీసుకున్నారు.

అయితే సీజన్ సిక్స్ లో కూడా ఇదే తరహాలో ఒక కంటెస్టెంట్ తీసుకునే ఆలోచనలో నిర్వాహకులు ఉంటే… దాదాపు ఆ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిన క్రమంలో నాగార్జున వ‌ర‌కు ఈ విషయం వెళ్ళటంతో.. ఆ జబర్దస్త్ కంటెస్టెంట్ ను తీసుకుంటే… యాంకరింగ్ చేయను అని షో నిర్వాహకులకు చెప్పినట్లు లేటెస్ట్ టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దానికి గల కారణం గతంలో సదరు జబర్దస్త్ కంటెస్టెంట్ నాగార్జునని కించపరిచే రీతిలో జబర్దస్త్ లో స్కిట్ చేశాడ‌ట‌.. అందువల్ల నాగార్జున.. ఆ కంటెస్టెంట్ నీ.. తీసుకోవద్దని షో నిర్వాహకులకు తెలియజేసినట్లు.. సోషల్ మీడియాలో వార్తలు వైరస్ అవుతున్నాయి. మ‌రి ఎవ‌రా కంటెస్టెంట్.. అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement