Monday, April 29, 2024

Big Story: హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ.. 2 డోసులతో రక్షణ గ్యారెంటీ: సీసీఎంబీ డైరెక్టర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశంతోపాటు తెెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ పొందారని సీసీఎంబీ డైరెక్టర్ డాక్ట‌ర్‌ వినయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ”ఇప్పటికే రాష్ట్రంలోని 80శాతం మందికి కరోనా మొదటి, సెకండ్‌వేవ్‌లో వైరస్‌ సోకింది. అప్పుడు సహజంగానే కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందాయి. ఆ తర్వాత… చాలా మంది రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో 97శాతం మందికి మొదటి డోస్‌, 56శాతం మంది రెండు డోస్‌ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటు సహజసిద్దమైన కరోనా యాంటీబాడీస్‌, ఇటు వ్యాక్సిన్‌తో వృద్ధిచెందిన యాం టీబాడీలతో హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తి జరిగినా పెద్దగా విపత్కర పరిస్థితులు నెలకొనకపోవచ్చు.” అని వివరించారు.

ఒమిక్రాన్‌ మనుషులపై ఏ మేరకు తీవ్ర ప్రభావాన్ని చూపించబోతుందో చెప్పడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ”ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలపై సౌత్‌ ఆఫ్రికా వెల్లడించిన అంశాలనే పరిగణన లోనికి తీసుకుంటున్నాం. ఒమిక్రాన్‌ ప్రభావంపై కచ్చితమైన అభిప్రాయానికి రావాలంటే దేశంలో ఆ వేరియంట్‌ వ్యాప్తిపై కచ్చితమైన పరిశోధనలు జరగాల్సి ఉంది. ఎంత దూరం వర కు కరోనా ఒమిక్రాన్‌ వ్యాపిస్తుందనేది అక్కడి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గదిలో ఇన్‌డోర్‌లో ఉంటే ఎక్కువ దూరం వ్యాప్తి చెందుతుంది. ఆరుబయట ప్రదేశాల్లో ఉంటే తక్కువ దూరంలో ఉన్నా తక్కువ దూరమే వ్యాపిస్తుంది. డెల్టా, ఒమిక్రాన్‌తోపాటు అన్ని రకాల కరోనా వేరియంట్లు గాలి ద్వారా వ్యాపిస్తు న్నాయని నిర్దారణ అయింది. యువతపైన ఏ మేరకు, వృద్ధుల పైన ఏ మేరకు కరోనా ఒమిక్రాన్‌ ప్రభావంపై ఇంకా కచ్చితమైన పరిశోధనా ఫలితాలు రాలేదు.”

డెల్టా వేరియంట్‌ కన్నా ఒమిక్రాన్‌ చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని ఇప్పటి వరకు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు. ”చాలా దేశాల్లో చిన్నారులకు కరోనా టీకా అనేది అక్కడి ప్రభుత్వాల నిర్ణయం. మనదేశంలోనూ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సరైన సమయంలో కేంద్రం చిన్నారుల టీకా విషయంలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.” కరోనా శాంపిల్‌ జీనోమ్‌ సీక్వెన్స్‌ అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమ న్నారు. ” ఒక్క శాంపిల్‌కు జీనోమ్‌ టెస్టు చేయాలంటే రూ.5వేల నుంచి రూ.10వేల దాకా ఖర్చు అవుతుంది. ఒమిక్రాన్‌ను గుర్తించే ప్రత్యేకమైన కిట్ల తయారీపై సీసీఎంబీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక్కసారి ఈ కిట్లు అందు బాటులోకి వస్తే జీనోమ్‌ సీక్వెన్స్‌ అవసరం లేకుండానే సోకింది ఒమిక్రానా..? కాదా..? అన్నది సులువుగా తెలిసిపోనుంది.

” సీసీఎంబీలో ఒక నెలలోనే 5వేల జీనోమ్‌ శాంపిళ్లను పరీక్ష అవకాశం ఉంది. ఒమిక్రాన్‌ సామాజిక వ్యాప్తి జరిగితేగాని ఆ వైరస్‌ నుంచి శరీరంలోని యాంటీబాడీలు ఏ మేరకు రక్షిస్తాయన్నది తేలనుందని స్పష్టం చేశారు. ”ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ రిస్క్‌ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికే టెస్టులు చేస్తున్నాం. అక్కడి భౌగోళిక పరిస్థితులల్లో వైరస్‌ లక్షణాలనే ఆపాదిం చుకుంటున్నాం. దేశంలో ఒమిక్రాన్‌తో ఎంత మేర అనా రోగ్యం కలుగుతోంది..? తదితర వివరాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ”

Advertisement

తాజా వార్తలు

Advertisement