Saturday, April 27, 2024

BIG BOSS 5: నేటి నుంచే ప్రారంభం

BIG BOSS సీజన్ 5 నేటి నుంచి తెరలేవనుంది. సెప్టెంబర్ 5 న  సాయంత్రం 6 గంటలకి ఓ పండగలా, ఓ ఉత్సవంలా ప్రారంభం అవుతోంది. ఇక అక్కడినుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు; శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది అంటూ మెనేజ్ మెంట్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఒక షోలో రకరకాల మనస్తత్వాలు వున్న హౌస్ మేట్స్ ని  ఎవర్ గ్రీన్ మన్మధుడు, వెండితెర కింగ్ నాగార్జున ఎలా డీల్ చేసారో మనం చూసాం. ఇప్పుడు హౌస్ లోకి ఎవరు వస్తారో, ఎవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో.. చూడాలి. మరి ఈ సీజన్ 5 లో సుమారు వంద రోజుల ఈ ప్రయాణానికి సెప్టెంబర్ 5 న తెర లేవబోతోంది.

  
సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు; శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు షో ప్రసారం అవుతుంది. చెప్పండి బోర్ డమ్ కి గుడ్ బై … వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ … ” అని చెప్పిన టాగ్ లైన్ ని నిజం చేయబోతోంది. నేటి నుండి ఐదో సీజ‌న్ ప్ర‌సారం కానుండగా, ఇన్నాళ్లు ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వ‌స్తున్న వార్త‌ల‌కు ఈ రోజుతో బ్రేక్ ప‌డ‌నుంది. ఈ రోజు సాయంత్రం 6గం.ల‌కు లాంచింగ్ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుండగా, దీనికి సంబంధించిన షూట్ నిన్న‌నే పూర్తైంది.

బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్ లిస్ట్ అంటూ కొంద‌రి పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇందులో 1. యాంక‌ర్ ర‌వి, 2. యాంక‌ర్ వ‌ర్షిణి, 3. యాక్ట‌ర్ ప్రియ 4. వ‌ర్ధ‌మాన న‌టి ల‌హ‌రి షారి 5. జ‌బ‌ర్ధ‌స్త్ ప్రియాంక 6. సిరి హ‌న్మంతు 7. సింగ‌ర్ రామ‌చంద్ర 8. సెవెన్ ఆర్ట్స్ సరయు 9 దీపక్ సరోజ్ 10. వర్థమాన నటి శ్వేతా వర్మ 11 షణ్ముఖ్ జస్వంత్ 12 నటరాజ్ మాస్టర్ 13. టెలివిజన్ యాక్టర్ సన్నీ 14 టెలివిజన్ నటుడు మానస్ షా 15 టెలివిజన్ నటి ఉమాదేవి (కార్తీకదీపం ఫేమ్) 16 మోడల్ జస్వంత్ 17 ఆర్జే కాజల్ 18 యూట్యూబర్ లోబో 19 లహరి షారి ఉన్నారు. ఇందులో ఎవ‌రు ఉంటారో, ఎవ‌రు ఉండ‌రో మ‌రి కొద్ది గంట‌ల‌లో తేల‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement