Sunday, May 5, 2024

మ‌రో ఆరు నెల‌ల్లో మా బిల్డింగ్ కి భూమి పూజ‌-మంచు విష్ణు

వ‌చ్చే ఆరు నెల‌ల్లో మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తామ‌ని చెప్పారు ..మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు. త్వరలోనే ‘మా’కు శాశ్వత బిల్డింగ్ కడతామని అన్నారు. అసోసియేషన్ బిల్డింగే ప్రధాన అజెండాగా మా ఎన్నికల బరిలోకి దిగిన విష్ణు.. ఇప్పుడు ప్రెసిడెంట్ స్థానంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మా సభ్యుల కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. మా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రధాన కర్తవ్యమని అన్నారు. మా ఎన్నికల సమయంలో మాట ఇచ్చినట్టుగానే అసోసియేషన్ బిల్డింగ్ నిర్మించేందుకు చర్యలు చేపట్టామని, మరో ఆరు నెలల్లో భూమి పూజ చేయనున్నామని తెలిపారు. సినిమా టికెట్ ధరల విషయంపై తాను కావాలనే సైలెంట్ గా ఉన్నాన‌న్నారు. టికెట్ ధరలు పెంచితే కొందరికి, తగ్గిస్తే మరికొందరికి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. టికెట్ ధరలు చాలా పెద్ద విషయమని.. దీనిపై ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement