Friday, May 24, 2024

‘భీమ్లా నాయ‌క్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా మంత్రి ‘కేటీఆర్’

సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం భీమ్లానాయ‌క్. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించారు. ఆయ‌న స‌ర‌స‌న నిత్యామీన‌న్, సంయుక్తా మీన‌న్ లు న‌టించారు.ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతాన్ని అందించారు. కాగా ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది మరోవైపు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం జరగనుంది. హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ విచ్చేయ‌నున్నార‌ట‌. ఈ వార్తతో ఇటు పవన్ అభిమానులు, అటు టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement