Thursday, May 16, 2024

అగ్నిపథ్ పై రేపు భారత్ బంద్

కేంద్రం తాజాగా ప్రకటించిన అగ్నిపధ్ పథకంపై ఆర్మీ ఉద్యోగార్థులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ పథకంపై యువత నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏంటి? అని ప్రస్తుతం ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ ఆర్మి పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

చాలా రాష్ట్రాల్లో ఈ అగ్నిపధ్ పధకంపై తీవ్రస్థాయిలో నిరసనలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 18వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. బీహార్, యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఉద్యోగార్థులు ఆందోళనలు చేస్తుండగా.. బీహార్ లోని ఆర్జెడి ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్ కు మద్దతు ఇచ్చాయి. ఇదిలా ఉంటే… సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో ఇంకా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. ఓవైపు అధికారులు ఆర్మీ ఉద్యోగార్థుల‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించినా…వెళ్ల‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement