Friday, May 3, 2024

ఢిల్లీలో బీటింగ్ రిట్రీట్ వేడుక‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీటింగ్ రిట్రీట్ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఈనెల 23న ప్రారంభ‌మైన రిప‌బ్లిక్ డే వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. బీటింగ్ రిట్రీట్ తో ఈ వేడుక‌లు ముగియ‌నున్నాయి. ఈ వేడ‌కుల‌కు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. బీటింగ్ రిట్రీట్ లో ప్ర‌ముఖులు పాల్గొన‌నున్నారు. బీటింగ్ రిట్రీట్ వేడుక విజయ్ చౌక్‌లో, రిపబ్లిక్ డే సెలబ్రేషన్ 2022లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ వేడుక‌ల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోడీ, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, పార్లమెంట్ హౌస్‌లలో బీటింగ్ రిట్రీట్ వేడుక కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.ఈ వేడుక దృష్ట్యా ఈరోజు మధ్యాహ్నం 2గంట‌ల నుండి రాత్రి 9:30 గంటల వరకు విజయ్ చౌక్ సాధారణ ట్రాఫిక్ కోసం మూసివేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement