Friday, May 3, 2024

‘బీస్ట్’ చిత్రం – భారీ రేటుకి తెలుగు అనువాద హ‌క్కులు

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ పై నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం బీస్ట్. ఈ చిత్రంలో హీరోగా విజ‌య్ న‌టించగా ..హీరోయిన్ గా పూజాహెగ్డే న‌టించింది. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను అదే టైటిల్ తో తెలుగులోను విడుదల చేయనున్నారు. తెలుగు అనువాద హక్కులకు భారీ రేటు పలికినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు విజయ్ చేసిన ‘మాస్టర్’ సినిమా తెలుగు అనువాద హక్కులు 6 కోట్లకు అమ్ముడుపోగా 14 కోట్ల మేర వసూళ్లను రాబట్టి, మంచి లాభాలను అందుకుంది. అందుకే ఈ సారి ఈ సినిమా అనువాద హక్కులు 11 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సెల్వరాఘవన్ .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement