Thursday, April 25, 2024

వీడిన సస్పెన్స్.. టీమిండియా హెడ్ కోచ్ గా గంగూలీ ఫ్రెండ్‌

టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌విపై ఎంతో మంది ఆస‌క్తి చూపినా.. ఇండియ‌న్‌కే అప్ప‌గించాల‌ని బీసీసీఐ భావించింది. చివరికి అనుకున్నది సాధించింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ (T-20 World Cup 2021)తో ప్ర‌స్తుత కోచ్ ర‌విశాస్త్రి పదవీ కాలం ముగియనుంది. ఈ మెగాటోర్నీ తర్వాత అతను త‌ప్పుకోనుండ‌టంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ నానా తంటాలు పడింది. టీమిండియా తర్వాతి కోచ్‌ ఎవరనేదానిపై చాలాకాలంగా ఉన్న ఉత్కంఠకి ఇక తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ (Rahul Dravid) బాధ్యతలు చేపట్టబోతున్నారు. గంగూలీ (Sourav Ganguly) మొండిపట్టుతో ఎట్టకేలకు ద్ర‌విడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచి బాధ్యతలు తీసుకునే రాహుల్, 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ హెడ్‌కోచ్ పదవిలోనే కొనసాగుతారు. ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న ద్ర‌విడ్ ఆ పదవికి రాజీనామా చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement