Sunday, May 5, 2024

Big Breaking | బాసర స్టూడెంట్​ దీపిక తండ్రికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

తెలంగాణలోని బాసర ట్రిపుల్​ ఐటీలో ఒత్తడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది విద్యార్థిని దీపిక. ఆమె ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆందోళనగా పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థిని తండ్రి వీరన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) రాత్రి జరిగింది. దీంతో అతడిని హుటాహుటిన నిర్మల్​లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబ సబ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement