Monday, April 29, 2024

30 ఏళ్ల కెరీర్ లో 56వ సారి బదిలీ.. అశోక్ ఖేమ్కా

త‌న 30ఏళ్ల కెరీర్ లో 56వ‌సారి బ‌దిలీ అయ్యారు హ‌ర్యానా రాష్ట్ర సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాలో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్) శాఖకు బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీకి ఆయన రాసిన లేఖ బదిలీకి కారణం అని చెపుతున్నారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్యా శాఖలో విలీనం చేయడంతో తనకు పని లేకుండా పోయిందని లేఖలో ఖేమ్కా పేర్కొన్నారు. తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటల పని అయినా ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్కైవ్స్ శాఖను సీఎస్ బదిలీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్కైవ్స్ శాఖలో ఖేమ్కా పని చేయడం ఇది నాలుగోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement