Sunday, May 5, 2024

Suicide Issue | బాస‌ర విద్యార్థిని దీపిక మృతికి గల కారణాలివేనా?.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

బాస‌ర విద్యార్థిని దీపిక ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఇవే అంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు విష‌యాలు స‌ర్య్కులేట్ అవుతున్నాయి. అందులో చాలామ‌టుకు అకాడమిక్ విధానంలో మార్పుల వల్ల విద్యార్థుల‌పై చాలా ప్రెష‌ర్ పెరిగింద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇంతకుముందు PUC విద్యార్థులకు సెమిస్టరు విధానంలో పరీక్షలు నిర్వహించేవారు. దానిని కొత్తగా వచ్చిన అధికారులు వార్షిక పరీక్షలుగా మార్చేసిన‌ట్టు స‌మాచారం.

ఇక‌.. విద్యార్థుల‌పై ఒత్తిడికి పెర‌గ‌డానికి.. వేసవి సెలవుల తర్వాత పరీక్షలు నిర్వహించడం కూడా మ‌రో ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. విద్యా విధానంలో ఎక్కడ కూడా ఫైనల్ పరీక్షల తర్వాతే సెలవులు ప్రకటిస్తారు. ఇక్కడ మాత్రం ఉన్నతాధికారులు తమకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మొన్నటి దాకా సెలవులు ఇచ్చి, ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం కూడా ఆందోళ‌న‌కు దారితీసిన‌ట్టు స‌మాచారం. దీంతో విద్యార్థుల్లో పరీక్షలపై అవగాహన లేక మాన‌సికంగా కృంగిపోయిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంతేకాకుండా ఏ మాత్రం అనుభవం లేని వ్య‌క్తికి అదనంగా అదనపు అడ్మిషన్ కంట్రోలర్ గా బాధ్యతలు అప్పజెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

కాగా, పరీక్షల్లో కొందరు విద్యార్థులు మాస్ కాపీయింగ్ కి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అట్లాంటి వారిని అందరు విద్యార్థుల ముందే ఆఫీస్ రూమ్ కి పిలిపించి సూటిపోటి మాట‌ల‌న్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ప‌రువు స‌మ‌స్య‌గా విద్యార్థులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పరువు పోయింద‌నుకుని ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో విద్యార్థిని బాత్ రూమ్ వెళ్తాన‌ని అంటే లేడీ గార్డ్ ని పంపకుండా ఒంటిరిగా ఆ బాలిక‌ను పంపారని స‌మాచారం. ఇక దీపిక మృతిపై వైస్ చాన్స్‌ల‌ర్ నియమించిన కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందోన‌ని అంతా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement