Friday, May 3, 2024

ఆపిల్ స్మార్ట్‌ వాచ్‌లు కూడా హ్యాక్ కావ‌చ్చు.. వెంట‌నే వెర్ష‌న్ అప్‌డేట్ చేసుకోవాల‌న్న కేంద్రం

ఆపిల్ కంపెనీ త‌యారు చేసే గ్యాడ్జెట్స్ అన్నా, ఫోన్లు అన్నా చాలా కాస్ట్లీగా ఉంటాయి.. అందులో హైలెవ‌ల్ సెక్యూరిటీ మేజ‌ర్స్ ఉంటాయ‌ని చాలామంది లైక్ చేస్తారు. అయితే.. ఆపిల్ స్మార్ట్ వాచ్‌లు కూడా హ్యాక్‌కి గుర‌వుతాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వాల హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఎందుకంటే ఆ వాచ్‌ల‌లో వాడుతున్న ఓల్డ్ వెర్ష‌న్ ఐఓఎస్‌లో ప్రాబ్లం ఉంద‌ని, అందుక‌ని హ్యాక‌ర్లు ఈజీగా యాక్సెస్ చేసే ప్ర‌మాదం ఉంద‌ని కేంద్రం తెలిపింది.

కాగా, ఆపిల్ వాచ్ లలో వినియోగించే వాచ్ ఓఎస్ 8.7కి ముందు వెర్షన్లలో అనేక లోపాలున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ లొసుగుల సాయంతో హ్యాకర్లు వాచ్ లోకి చొరబడి ఆర్బిట్రేటరీ కోడ్ రన్ చేయడమే కాకుండా, సెక్యూరిటీ వ్యవస్థలను బైపాస్ చేసి స్మార్ట్ వాచ్ ను తమ అధీనంలోకి తెచ్చుకోగలరని వెల్లడించింది. వాచ్ ఓఎస్ పాత వెర్షన్లు వాడుతున్న వారు వెంటనే కొత్త వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని, ఆపిల్ నుంచి సెక్యూరిటీ ప్యాచెస్ కోరాలని సూచించింది.

ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) దీనికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్లడించింది. ఆపిల్ వాచ్ 8.7కు ముందు పాత ఓఎస్ వాడుతున్న వారు అత్యంత తీవ్ర ముప్పు ముంగిట ఉన్నట్టేనని సీఈఆర్టీ తెలిపింది. అటు, ఆపిల్ కూడా వాచ్ ఓఎస్ 8.7ను రిస్క్ తో కూడిన వెర్షన్ గా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement