Thursday, April 25, 2024

ఏపీ,తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ.. ఈ-పాస్ ఉంటేనే అనుమతి!

ఏపీ- తెలంగాణ సరిహద్దులో భారీగా వాహనాలు నిలిచాయి. ఏపీ నుంచి వచ్చే వాహనాలను కోదాడ వద్ద తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. ఆదివారం ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకల తాకిడి పెరిగింది. ఈ-పాస్ లు లేని వాహనాలను అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద నిలిపివేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి వాహానానినికి ఈ-పాస్ తప్పనిసరి చేయచటంతో పాస్ ఉన్నవాహానాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రతి వాహానాన్ని చెక్ చేస్తూ ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఈ-పాస్ లేకుండా ఏపీ నుంచి వచ్చిన వాహనాలను వెనక్కి పంపించి వేస్తున్నారు. రామాపురం చెక్ పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు కనిపించాయి. ఎంతసేపు వేచిచూసినా అనుమతించకపోవడంతో చాలామంది వాహనదారులు నిరాశగా వెనుదిరిగారు. ప్రయాణాలు చేసేవారు ఈ-పాస్ లతో రావాలని తెలంగాన పోలీసులు స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలో లాక్‌డౌన్ సమయాల్లో సడలింపులు ఇవ్వటంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణలో లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement