Monday, April 29, 2024

మంత్రి పేర్ని నానితో – ఆర్.నారాయ‌ణమూర్తి భేటీ

ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాత‌, న‌టుడు ఆర్.నారాయ‌ణ‌మూర్తి స‌మావేశం అయ్యారు. ఈ మేర‌కు సినీ రంగానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై మంత్రితో చ‌ర్చించారు. ఏపీలో సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై ఇప్ప‌టికే ఆర్.నారాయ‌ణ‌మూర్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించాలని ఆయ‌న కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి నానితో ఈ రోజు ఆయ‌న భేటీ అయ్యారు. కొన్ని విషయాలు వ్య‌క్తిగ‌తంగా అడిగి తెలుసుకునేందుకు తాను పేర్ని నాని వద్దకు వచ్చానని ఈ సంద‌ర్భంగా ఆర్.నారాయణమూర్తి వెల్ల‌డించారు. మ‌రోవైపు, పేర్ని నానితో తాజాగా మచిలీపట్టణంలో ఇద్దరు థియేటర్ యజమానులు కలిశారు. తమ థియేటర్లపై తీసుకున్న చర్యల గురించి చ‌ర్చించారు. అయితే, ఆ అంశంపై జిల్లా జాయింట్ కలెక్టర్ కు విజ్ఞ‌ప్తి చేసుకోవాల‌ని పేర్ని నాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement