Friday, May 3, 2024

Spl Story | వరల్డ్​ కప్​లో సంచలనాలు.. నెదర్లాండ్స్​ దెబ్బకు కిందా, మీద అవుతున్న సౌతాఫ్రికా!

వరల్డ్​ కప్​లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రేట్​, గ్రేటెస్ట్​ అనుకున్న జట్లు కూడా బోల్తాపడిపోతున్నాయి. టాపెస్ట్​ జట్టు అనుకున్న ఆసీస్​ ర్యాంకింగ్స్​లో చిట్ట చివరికి చేరి, కొట్టుమిట్టాడుతోంది. ఇక.. క్రికెట్​కు పేరుగాంచిన ఇంగ్లండ్​ జట్టును ఆఫ్గాన్​ చిత్తు చేసింది. ఇవ్వాల జరిగే మరో మ్యాచ్​లో నెదర్లాండ్స్​ బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా కిందా, మీద పడుతోంది.. ఈ మ్యాచులో మిగతా ఓవర్లను ఎలా ఆడాలనే ఆందోళనలో బ్యాట్స్​మన్​ ఉన్నారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వరల్డ్ కప్ లో హేమా హేమీలు అనుకున్న జట్లు పసికూనల చేతుల్లో ఓటమి పాలవుతున్నాయి. మొన్న జరిగిన మ్యాచ్​లో ఇంగ్లండ్​ జట్టుని ఆఫ్గాన్​ చిత్తు చేసింది. ఇక.. ఇవ్వాల మరో సంచలనం నమోదయ్యే చాన్స్​ కనిపిస్తోంది.  ధర్మశాలలో వర్షం వల్ల లేటుగా ప్రారంభమైన మ్యాచ్ లో… తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అయితే, చేజింగ్​లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.   

ఇక.. 11.2 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు.. 25 ఓవర్ల వరకు కీలకమైన 6 వికెట్లను కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో  కెప్టెన్ బవుమా (16), క్వింటన్ డికాక్ (20), వాన్ డర్ డుస్సెన్ (4), ఐడెన్ మార్ క్రమ్ (1), క్లాసేన్​ (28), మార్కో జాన్​సేన్ (9)​ పరుగులు చేసి పెవిలియన్​ పట్టారు. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇద్దరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న దశలో వాన్ బీక్ బౌలింగ్ లో క్లాసెన్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్లాసేన్​, జాన్​సేన్​ కూడా అవుటయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు చేజార్చుకుంది.  25 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 111 పరుగులుగా ఉంది.. ఇంకా 102 బంతుల్లో 134 పరుగులు చేయాల్సి ఉంది..

- Advertisement -

ఇక.. నెదర్లాండ్స్​ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ వాన్ డెర్ మెర్వ్ 2 వికెట్లు, వాన్ మీకెరెన్ 2, వాన్ బీక్ 1, అకెర్ మన్ 1, వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో కోయిట్జీ, డేవిడ్​ మిల్లర్​ ఉన్నారు.  

ఇంగ్లండ్​పై గెలిచిన ఆనందంలో ఆఫ్గానిస్తాన్​ జట్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement