Monday, April 29, 2024

TSRTC | టీఎస్‌ ఆర్టీసీ మరో ఆఫర్‌.. 100 చెల్లిస్తే 60 కిలోమీటర్లు జర్నీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయాణికులను ఆకర్శించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్న టీఎస్‌ ఆర్టీసీ తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.100 చెల్లిస్తే 60 కి.మీ.ల పరిధిలో రానుపోను ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు వర్తించే ఈ ఆఫర్‌ ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈమేరకు టి-9 టికెట్‌ పోస్టర్‌ను శుక్రవారం ఆర్టీసీ ఎండి విసి సజ్జన్నర్‌ శుక్రవారం బస్‌ భవన్‌లో ఆవిష్కరించారు.

60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్‌ సిటిజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్‌ కార్డును కండక్టర్లకు చూపించి టి-9 టికెట్‌ను పొందవచ్చని తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రతీ రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారనీ, అందులో మహిళలు, సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశర్యతో పల్లె వెలుగు బస్సుల్లో టి-9 టికెట్‌కు ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ఈ టికెట్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందనీ, గామీణ, పట్టణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలని కోరారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటికే టి-24, టి06, టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చామనీ, వాటికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నదని వెల్లడించారు. ఆ టికెట్లను విశేష స్పందన వస్తున్న దృష్ట్యా తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం టి-9 టికెట్‌ను తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ టికెట్‌కు సంబంధించి పూర్తి వివరాలకు టీఎస్‌ ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement