Saturday, May 18, 2024

Big Story: మరో చరిత్రకు శ్రీకారం, మతోన్మాదంపై పోరాటం.. నిన్న కేసీఆర్, ఇవ్వాల స్టాలిన్​

భారత రాజ్యాంగం గురించి మాట్లాడి యావత్​ దేశం దృష్టిని తెలంగాణ వైపు మళ్లించడంలో సక్సెస్​ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​.. ఇప్పుడు మతోన్మాదంపై కలిసి పోరాడుదాం రండి అని లేఖలు రాసి యావత్​ దేశాన్ని మరో చర్చలోకి నెట్టారు తమిళనాడు సీఎం స్టాలిన్​..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్​.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏది చేసినా ఫర్​ఫెక్ట్​ లైన్​ తీసుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలకు కూడా ఇంపార్టెన్స్​ ఇస్తూనే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో వారిని ఇన్​వాల్వ్​ చేస్తున్న తీరు యావత్​ దేశాన్ని ఆకట్టుకుంటోంది. అదేవిధంగా ఇంతకుముందున్న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను అదే పేరుతో కొనసాగించడాన్ని రాజకీయ వర్గాలు మెచ్చుకున్నాయి. ఇప్పుడు దేశానికి దిక్సూచిగా మారేందుకు తను మరో మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ‘‘మరో చరిత్రకు శ్రీకారం చుడదా రండి’’ అంటూ బీజేపీయేతర పార్టీలకు లేఖలు రాశారు. అందులో ఏపీ సీఎం జగన్​, మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్​ కళ్యాన్​ కూడా ఉన్నారు. ఇట్లా 37 పార్టీల అధినేతలకు స్టాలిన్​ రాసిన లేఖల గురించి ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

మొన్న ప్రగతిభవన్​లో జరిగిన సుధీర్ఘ ప్రెస్​మీట్​లో తెలంగాణ సీఎం కేసీఆర్​ కూడా దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, దానికి తాను ఎంతటి త్యాగానికైనా రెడీగా ఉన్నట్టు చెప్పారు. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం రాష్ట్రాలకు ప్రయారిటీ ఇవ్వకుండా అన్ని అధికారాలను తమ చేతుల్లోకి తీసుకోవడం, సమాఖ్య స్ఫూర్తిని ప్రధాని మోడీ దెబ్బతీస్తున్నారని చెప్పారు. దీనిపై బీజేపీ ఆందోళనలు చేపడుతోంది. కేసీఆర్​ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ సహా అన్ని రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇక్కడ సీఎం కేసీఆర్​ కోరుకున్నది కూడా అదే. యావత్ దేశం దృష్టి తనవైపు తిప్పుకోవాలని భారీ స్కెచ్​ వేశారు కేసీఆర్​. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా ఇతర పార్టీలన్నీ ఇదే అంశంపై చర్చ చేస్తూ.. ఆందోళనలకు పూనుకుంటున్నాయి.

సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి సమర్థించారు. ఎస్​.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, కేసీఆర్​ వ్యాఖ్యలపై పబ్లిక్​ ఒపీనియన్​ తెలుసుకోవచ్చని సూచించారు. రాజ్యాంగం మార్చాల్సిన అంశంపై చర్చ తప్పకుండా జరగాలని సజ్జల డిమాండ్​ చేశారు. అయితే దేశవ్యాప్తంగా చర్చ కోసమే రాజ్యాంగంలో మార్పులకు సీఎం కేసీఆర్​ కోరారని స్పష్టమవుతోంది. బేజీపీని బంగాళఖాతంలో కలపాలని అన్నారు. భారత రాజ్యాంగం గురించి మాట్లాడి యావత్​ దేశం దృష్టిని తెలంగాణ వైపు మళ్లించడంలో సక్సెస్​ అయ్యారు.

- Advertisement -

అయితే.. సీఎం స్టాలిన్​ లేఖలు రాయడం కూడా ఇప్పుడు ఇదే అంశాన్ని మరింత బలపరుస్తోంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని, 37 పార్టీలకు లేఖలు రాయడం కూడా తమ వ్యూహంలో భాగంగానే అంటున్నారు పొలిటికల్​ అనలిస్టులు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసమున్న వారంతా ఏకతాటిపైకి వచ్చి మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు రావాలని ఆ లేఖలో స్టాలిన్​ పేర్కొన్నారు. అందరం ఏకతాటిపైకి వస్తే తప్పా ఈ శక్తులపై పోరాడడం సాధ్యం కాదన్నారు. ఇందుకోసం ‘‘అభికల భారత సామాజిక సమాఖ్య’’లో చేరాలని కోరారు స్టాలిన్​.

ఈ క్రమంలోనే కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్​ , బెంగా సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్​మోహన్​రెడ్డి, టీడీపీ చీఫ్​ చంద్రబాబు, జనసేన అధినేత పవన్​ కల్యాన్​ తదితరులకు స్టాలిల్​ లేఖలు రాశారు. మొత్తంగా 37 పార్టీలకు లేఖలు రాసిన ఆయన బీజేపీని మాత్రం పక్కనపెట్టడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement