Saturday, April 27, 2024

తిరుప‌తి జూ నుంచి..విశాఖ జూ పార్క్ కి జంతువులు

తిరుప‌తి జూ నుంచి..విశాఖ‌ జూ పార్క్ కి మూడు అడ‌వికోళ్లు, ఒక జ‌త అడ‌వికుక్క‌లు, నాలుగు కొమ్ముల జింక‌లు ఒక జ‌త‌, ఒక అడ‌వి బ‌ర్రెను తీసుకువ‌చ్చారు. కాగా అదే సమయంలో, విశాఖ జూ నుంచి తిరుపతి జూకి 2 ఆడ నక్కలు, ఒక జత హైనాలు, ఒక అడవిదున్నను అందించారు. ఈ మేరకు విశాఖ జూ పార్కు క్యూరేటర్ నందిని సలారియా వెల్లడించారు. ఇటీవల విశాఖకు ..చండీగఢ్ లోని చత్ బీర్ జంతుప్రదర్శన శాల నుంచి రెండు మొసళ్లు, 6 అడవికోళ్లు, మూడు నీటికోళ్లు, 3 గుడ్లగూబలు, ఒక మగ హైనాను తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement