Sunday, May 5, 2024

ఎవరినీ తక్కువ చేసి మాట్లాడొద్దు.. వ్యక్తి గౌరవాన్ని కాపాడుదాం: ఆనంద్ మహీంద్రా

కర్నాటకలోని మహీంద్రా అండ్ మహీంద్రా SUV షోరూమ్‌ లో ఒక రైతును సేల్స్ మన్ అవమానించడంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మంగళవారం రెస్పాండ్ అయ్యారు. ఒక వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడం ఎంతో ఇంపార్టెంట్ అని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “@MahindraRise యొక్క ప్రధాన ఉద్దేశ్యం మా కమ్యూనిటీలు & అన్ని వాటాదారులను అలర్ట్ చేయడమే. ఒక కీలకమైన అంశమేంటంటే.. వ్యక్తి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం ఎంతో ముఖ్యం. ఏదైనా ఉల్లంఘన జరిగినప్పుడు మేము దాని చాలా సీరియస్ గానే తీసుకుంటాం” అని ఆయన ట్వీట్ చేశారు.

బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు కర్నాటకలోని ఓ షోరూమ్‌కి వెళ్లిన రైతును సేల్స్ మెన్‌ తనకు కారు కొనే స్థోమత లేదని వెక్కిరించినందుకు అవమానం జరిగిందని చెప్పాడు. దాంతో ఆ రైతు చాలెంజ్ చేసి అరగంటలో నగదుతో తిరిగి వచ్చాడు. దీంతో సేల్స్ మన్ క్షమాపణలు చెప్పాడు. శుక్రవారం కర్నాటకలోని తుమకూరులోని మహీంద్రా షోరూమ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అంతటా వైరల్ కావడంతో ఆనంద్ మహీంద్రా కూడా ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు.

దీనికి సంబంధించి ఏం జరిగిందంటే..

రైతు కెంపేగౌడ బొలెరో కొనేందుకు వెళ్లగా సేల్స్ మన్ అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే.  కారు విలువ రూ.10 లక్షలు.. మీ జేబులో రూ.10 కూడా ఉండకపోవచ్చు” అని అసభ్యంగా మాట్లాడాడు. కెంపెగౌడను అతని రూపాన్ని బట్టి తక్కువ అంచనా వేశాడని,  రైతు అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎట్టకేలకు కెంపెగౌడకు క్షమాపణలు చెప్పాడు. దాంతో తాను మీ షోరూమ్ నుండి కారు కొనడం ఇష్టం లేదని రైతు తన రూ.10 లక్షలతో వెళ్లిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement