Saturday, May 4, 2024

సీల్ చేప చేసిన ప‌ని చూస్తే.. అవాక్క‌వ్వాల్సిందే

స‌ముద్రం ప‌క్క‌నే ఓ రిసార్ట్ ఉంది. కాగా ఆ రిసార్ట్ లో ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసి, పక్కనే కాసేపు సేద తీరేందుకు రిక్లైనర్ మాదిరి పడక కుర్చీలు ఏర్పాటు చేసి ఉన్నాయి. రెండు కుర్చీలు ఉంటే, అందులో ఒక కుర్చీలో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఇంతలో సముద్రం నుంచి చిన్నగా రిసార్ట్ లోకి పాకుకుంటూ వచ్చిన సీల్ చేప స్విమ్మింగ్ పూల్ లోకి దిగింది. అటూ ఇటూ రెండు రౌండ్లు ఈదిన తర్వాత ఒడ్డుకు చేరి ఆ వ్యక్తి కూర్చున్న పడక కుర్చీ వైపు వచ్చేస్తుండడంతో.. సదరు వ్యక్తి లేచి దానికి దారిచ్చాడు.

అది దర్జాగా ఆ కుర్చీ ఎక్కి పడుకుంది. అంటే అచ్చం ఆ వ్యక్తి చేసినట్టుగా ఇది అనుకరించింది. అది కావాలనుకుంటే ఏ బండ రాయిపైనో, లేదంటే రిసార్ట్ మెట్లపైనో పడుకోవచ్చుగా.. మనిషి మాదిరే చేయడం ఎందుకు? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. వారాంతపు ప్రణాళికలను గుర్తించిన ఓ జెంటిల్ మెన్ ఇదని నేను నమ్ముతున్నాను అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు జంతువులు సైతం మావన సంస్కృతిని అలవరుచుకుంటున్నాయంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement