Tuesday, April 30, 2024

కెమెరా ముందే నాపై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌న్న అమెరిక‌న్ న‌టి

కెమెరా ముందే త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారని అమెరిక‌న్ న‌టి, మ్యూజీషియ‌న్ ఇవాన్ రాచెల్ వుడ్ తెలిపింది. మార్లిన్ మాన్స‌న్ రేప్ కి పాల్ప‌డ్డాన‌ని చెప్పింది. 2007లో సింగిల్ హార్ట్ గ్లాసెస్ మ్యూజిక్ వీడియో కోసం వెళ్లిన‌ప్పుడు ఈ దారుణం జ‌రిగింద‌ని వెల్ల‌డించింది. ఇవాన్ రాచెల్ వుడ్ జీవితం, ఆమె కెరీర్ ఆధారంగా.. ఇటీవల ‘ఫీనిక్స్ రైజింగ్’ అనే కొత్త డాక్యుమెంటరీ చేశారు. దీనిని 2022 సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించారు. ఆ వీడియోలో ప్రకారం.. గతంలో.. తాను మ్యూజిక్ వీడియో చేస్తున్నప్పుడు.. నటిస్తున్నట్లే నటించి.. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. తనకు స్పృహ తప్పేలా చేసి.. కెమేరాల ముందే అత్యాచారానికి పాల్పడ్డార‌న్నారు. ఇప్పటి వరకు నేను సెట్స్ లో.. అన్ ప్రొఫెషనల్ గా ఎప్పుడూ లేనని.. అయితే.. ఆ రోజు మాత్రం తాను సురక్షితంగా లేనని’’ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఆ ఘటన తర్వాత తనకు తానుగా ఎలా వాదించుకోవాలో.. తనకు తెలియలేదని ఆమె చెప్పింది. తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని.. అందుకే మాట్లాడలేకపోయానని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement