Thursday, April 25, 2024

రేపే గులాబీ పండుగ – 119 నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అసెంబ్లి ఎన్నికల ముంగిట నిర్వహిస్తున్న సమావేశాలు కావడంతో అధిష్టానం ప్రత్యేక దృష్టిని పెట్టింది. వచ్చే ఎలక్షన్స్‌కి బలమైన పునాదులుగా ఈ మీటింగ్‌లను తీర్చిదిద్దుతోంది. తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్‌ పాలనలో మారిన ముఖ చిత్రాన్ని ప్రజలకు వివరించే విధంగా ఉండాలని బావిస్తోంది. ప్రతినిధుల సభల్లో తీర్మానాలను చేయాలని స్పష్టం చేసింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు. పార్టీ యంత్రాంగానికి ఇది గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. పార్టీ కేడర్‌ను అన్ని విధాలుగా సిద్ధం చేయాలని దిశా నిర్ధేశం చేశారు. పార్టీ ముచ్చటగా మూడో సారి హ్యాట్రిక్‌ విజయం సాధించే దిశగా కార్యక్రమాలు ఉండాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనతో పాటు బీజేపీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై పూర్తి వివరాలు అందరికి వెళ్లేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రధానంగా ఆరు తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టాలని తెలిపారు.

ప్రతినిధుల సభలో తీర్మానాలు

  1. వ్యవసాయానికి సాయం
  2. సంక్షేమం-సామాజిక బాధ్యత
  3. విద్యా రంగం-ఉపాధి
  4. పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి
  5. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడం
  6. స్థానిక అంశాలు
    వీటితో పాటు నియోజకవర్గా ల్లోని ప్రధాన అంశాలను సమయాన్ని బట్టి తీర్మానాలు చేసుకోవాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

తెలంగాణలోని 119 అసెంబ్లి నియోజక వర్గాల్లో రేపు గులాబీ సంబరాలు నిర్వహిస్తోం ది. ప్రతి సెగ్మెంట్‌లో నియోజకవర్గ ప్రతి నిధుల సభలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 3000 మంది నుంచి 3500 మంది వరకు పార్టీకి చెందిన వారు ఈ మీటింగ్‌లో పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇంఛార్జీలు వీటి ఏర్పాట్ల ను ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తూ అందరూ పాల్గొనేలా ప్రయత్నిస్తున్నారు. ప్రతినిధుల సభల్లో వ్యవసాయం, సంక్షేమం, పల్లె, పట్టణ – ప్రగతి, విద్యా – ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయాలని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. యావత్‌ దేశానికే తెలంగాణ వ్యవసా యం దిక్సూచిలా మారిం దని తీర్మానాల్లో ప్రస్తావిం చాలని తెలిపారు. కాళేశ్వ రం, మిషన్‌ కాకతీయ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలతో అన్నదాతకు అండగా నిలిచా మని తెలిపేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి దేశ రైతాంగం నోట్లో మట్టి కొట్టే కుట్రను పన్నిందని.. దేశం కడుపు నింపేలా తెలంగాణ రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనకుండా అన్యాయం చేసిన విధానాన్ని కూడా సభలో చర్చించాలని సూచించారు. పసి పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు అందరికి అందుతున్న సంక్షేమాలపై కూడా వివరించాల న్నారు. విద్యారంగంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రత్యేక ప్రసంగాలు ఉండాలని చెప్పారు. గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్థిపై 1,25,000 రూపాయలను ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానని ఇచ్చిన మాట ఎటు పోయిందో చెప్పాలని ప్రశ్నించాలని సూచించారు. ఐదో తీర్మానంలో బీజేపీ చేసిన మోసాలు, కుట్రలు, అన్యాయాలపై నిలదీయాలని కేటీఆర్‌ తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసరాల రేట్ల పెరుగుదల, కార్పొరేట్‌ దోస్తులకు రుణాల మాఫీ, ఉప్పు, పప్పు పిరం లాంటివి ప్రధానంగా చర్చించా లని స్పష్టం చేశారు. ఇక చివరగా స్థానిక అంశాలు, పెండింగ్‌ లోని సమస్యలు, విభజన హామీలు, ప్రజల డిమాండ్‌లపై తీర్మానం చేయాలని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement