Thursday, May 2, 2024

చేనేత‌పై జీరో జీఎస్టీ కోసం – కేంద్ర ప్ర‌భుత్వానికి ల‌క్ష ఉత్త‌రాలు

జీరో జీఎస్టీ కోసం అఖిల భార‌త ప‌ద్మ‌శాలి సంఘం చేనేత విభాగం ఉద్య‌మాన్ని చేప‌ట్ట‌నున్నారు. పోచంప‌ల్లిలో జీరో జీఎస్టీ అమ‌లు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వానికి ల‌క్ష ఉత్త‌రాలు రాసి పంప‌నున్నారు. ఈ నెల 28న ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కొండా లక్షణ్ బాపూజీ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత చేనేతపై జీరో జీఎస్టీ అమలు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఉత్తరాలు (Letters) పంపే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, స్థానిక శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, పద్మశాలి సంఘ అగ్ర నేతలు, చేనేత నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని పద్మశాలి సంఘం ఓ ప్రకటనలో పిలుపు ఇచ్చింది.

ఇదే ప్రకటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఏ విధంగా లేఖలు రాయాలా? అనే వివరాలనూ పేర్కొంది. ఆంగ్లంలో ఉత్తరాలు రాసి చివరలో సంతకం పెట్టాలని, దాని కిందే పేరు, జిల్లా, రాష్ట్రం పేరు రాయాలని కోరింది. భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ.. చేనేతపై జీరో జీఎస్టీ విధించాలని కోరుతూ లేఖ రాయాలని వివరించింది. అంతేకాదు, చేనేత భారత వారసత్వం అని, దయచేసి దాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేయాలని తెలిపింది. ప్రధానమంత్రి చిరునామాగా.. న్యూఢిల్లీలోని రైసినా హిల్, సౌత్ బ్లాక్‌కు లేఖ రాయాలని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement