Sunday, May 5, 2024

‘అక్షర’ లీలలు.. చిట్టీల పేరుతో ఘరానా మోసం, డీజీపీ, అడిషనల్‌ డీజీపీని ఆశ్రయించిన బాధితులు

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: చొక్కా మలగకుండా.. చెమట చుక్క కారకుండా.. సులభంగా డబ్బులు సంపాదించేందుకు వైట్‌కాలర్‌ మాఫీయా అలవాటు పడింది. అమాయకుల అవసరాలను ఆసరా చేసుకొని క్యాష్‌ చేసుకోవడానికి చిట్‌ఫండ్‌ కంపెనీలను ఏర్పాటుచేసి మోసాలకు పాల్పడుతున్నారు. రిజిస్టర్‌ ఛిట్‌ ఫండ్స్‌ అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది. రిజిస్టర్‌ చిట్‌ ఫండ్లపై చిట్స్‌ రిజిస్ట్రార్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కవి ుషనర్‌ అజమాయిషీ ఉంటుంది. ఒక చిట్టీని నడిపించాలంటే దానికి సంబంధించినటువంటి చిట్టీ విలువకు సంబంధించిన మొత్తాన్ని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. సంబంధిత చిట్టీకి సంబంధించి కాలపరిమితి పూర్తి అయిపోయి.. ఆ చిట్టీలోని ఖాతాదారులందరికి డబ్బులు చెల్లించినట్లుగా సంబంధిత కంపెనీ అక్విటెన్స్‌ సమర్పిస్తేనే..ఆ చిట్టీ ముగిసినట్లుగా చిట్స్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ తనవద్ద డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని సంబంధిత కంపెనీకి ఇస్తారు.

ఇంత పకడ్బంధీగా రిజిస్టర్‌ చిట్‌ ఫండ్‌ కంపెనీల్లో ఉంటుందనే నమ్మకంతో పైసపైసా కూడబెట్టుకొని పొదుపు చేసిన డబ్బుల ను మాయమాటలతో అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ చిట్టీలో సభ్యులుగా చేర్పించుకొని చిట్టీ పూర్తయినా… డబ్బులు చెల్లించకుండా ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. వరంగల్‌ కేంద్రంగా ఏర్పాటుచేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినబడిన అక్షర చిట్‌ఫండ్స్‌ లీలలు ఇన్ని అని ్న కాదు. అక్షర చిట్‌ఫండ్‌లో జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే వరంగల్‌ పోలీసులు అక్షర చిట్‌ఫండ్‌ చైర్మన్‌ పేరాల శ్రీనివాస్‌రావును అరెస్టు చేసి జైలుకు పంపించారు. బాధితుల నుంచి 200లకు పైగా ఫిర్యాదులు రావడంతో వరంగల్‌ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అయితే బాధితులు రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌ శేషాద్రికి ఫిర్యాదు చేయడంతో అక్షర చిట్‌ఫండ్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ స్వయంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాయడంతో పోలీస్‌ యంత్రాంగం కదిలి చర్యలకు పూనుకున్నారు.

చిట్టీ గడువు పూర్తయినా.. డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు
చి ట్టీలో 25 మంది.. 40 మంది.. 50 మంది ఇలా సభ్యులు ఉంటారు. ప్రతినెల ఒక్కొక్క సభ్యుడి కి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో ఒకనెల కంపెనీలు ఎలాంటి పాట లేకుండా చిట్టీని తీసుకుంటాయి. నాలుగు లేదా ఐదు, ఆరు ఇలా ఏదొక చిట్టీని తమ ఖాతాలో జమ చేసుకుంటారు. ఆ తర్వాత సభ్యులకు నెలనెలా చిట్టీ పాట నిర్వహిస్తూ పాడుకున్న వ్యక్తికి కావాల్సిన షూరిటీలు ఇచ్చిన నెల 15 రోజుల్లో సంబంధిత వ్యక్తికి చిట్టీ అమౌంట్‌ను చెక్కురూపంలో అందించాల్సి ఉంటుంది. కానీ చిట్‌ ఫండ్‌ యాజమాన్యాలు షూరిటీలు, ఎంక్వైరీల పేరులతో రెండు, మూడు నెలలు వ్యవధి కొనసాగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు పెద్దఎత్తున ఉన్నాయి. షూరిటీలు అన్ని సక్రమంగా ఉన్నప్పటికి చిట్టీలు ఇవ్వకుండా నెలనెల కార్యాలయాల చుట్టు తిప్పుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

షూరిటీల పేరుతో ప్లాట్ల మార్ట్‌గేజ్‌
రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ నామ్స్‌ ప్రకారం చిట్టీలకు సంబంధించిన షూరిటీలను ప్రభుత్వ ఉద్యోగస్తులు లేదా లిమిటెడ్‌ కంపెనీలు (సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఆర్టీసీ) సంబంధించిన ఉద్యోగులతో సంతకాలు తీసుకుంటారు. ఒక ఉద్యోగి ఒక చిట్టీ దారునికి షూరిటీ ఉన్నట్లయితే అతను చిట్టీ పూర్తయ్యే వరకు మరో వ్యక్తి షూరిటీ పెట్టడానికి అనర్హులుగా ఉంటారు. అయితే నెలవారీగా వస్తున్నటువంటి గ్రాస్‌ పేమెంట్లు, నెట్‌ పేమెంట్‌ లెక్కలు వేసుకొని రెండు, మూడు చిట్టీలు కూడా షూరిటీలుగా తీసుకోవచ్చు. అయితే చిట్‌ ఫండ్‌ కం పెనీలు అలా కాకుండా ఖాతాదారుల రిజిస్ట్రేషన్‌ ప్లాంట్లు ఉంటే వాటిని మార్ట్‌ గేజ్‌ చేసుకొని చిట్టీ క్రింద తాకట్టుపెట్టుకొని ఇచ్చే ఆనవాయితీకి శ్రీకారం చుట్టాయి. చిట్టీ డబ్బులు ఇవ్వమంటే మీ ప్లాట్లు మార్ట్‌గేజ్‌ చేశారు. వాటిని ఇవ్వమం టూ ఖాతాదారులపై బెది రింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. వజ్రాల అరుణ కొండారెడ్డిలకు సంబంధించినటుంటి నాలుగు ప్లాట్లను చిట్టీలకు షూరిటీలుగా మార్ట్‌ గేజ్‌ చేసుకొని అదనంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు చిట్టీ డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడంతో సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో అక్షర చిట్‌ ఫండ్‌ చైర్మన్‌ పేరాల శ్రీనివాస్‌రావుపై కేసునమోదు కావడంతో జైలుకు కూడా వెళ్లారు.

బాధితులకు కోట్లల్లో బకాయిలు
అక్షర చిట్‌ఫండ్‌ కంపెనీలో ఖాతాదారులకు లక్షల్లో కాదు.. కోట్లల్లో కూడా బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. చిట్స్‌ డబ్బులను ఖాతాదారులకు సకాలంలో చెల్లించకుండా దారి మళ్లించి రియల్‌ ఎస్టేట్‌ దందాను కొనసాగిస్తూ కోట్లకు పడగలెత్తారు. చిట్టీ ఖాతాదారులు ఎత్తుకున్న వాటికి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కంపెనీలపై ఉన్నటువంటి నమ్మకాలతో ఖాతాదారులు తమ పిల్లలు విదేశాలల్లో స్థిరబడి వారు పంపించి నటువంటి డబ్బులతో చిట్‌ పండ్‌ కంపెనీల్లో చిట్టీలు వేస్తే కంపెనీ యాజమాన్యాలు సకాలంలో డ బ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

డీజీపీని ఆశ్రయించిన బాధితులు
అక్షర చిట్‌ ఫండ్‌ కంపెనీలో తనకు జరిగినటువంటి మోసాలను బాధితులు ఏకంగా డీజీపీతో మొరపెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నటువంటి వజ్రాల అరుణ కొండారెడ్డి దంపతులకు అక్షర చిట్‌ఫండ్‌లో రెండున్నరకోట్ల రూపాయలువాల్సి ఉన్నది. దాదాపు 230కుపైగా చిట్స్‌ వేశారు. చిట్టీలు ఎత్తిన డబ్బులను ఖాతాదారులకు ఇవ్వకుండా వాటిని కంపెనీ యాజమాన్యం తమ కంపెనీలో ఖాళీలు ఉన్నటువంటి చిట్టీలకు మళ్లిస్తూ, 230 చిట్టీల్లో చేర్చారు. రిజిస్ట్రర్‌ చిట్టీ కంపెనీ కావడంతో తమ డబ్బులు ఎక్కడికి పోవు అని గుడ్డి నమ్మకంతో రెండున్నర కోట్ల వరకు పొదుపు చేశారు. వీటిలో 65 లక్షల రూపాయల చిట్టీలను పాటపాడి ఎత్తారు. కానీ రెండు సంవత్సరాలైనా.. డబ్బులు ఇవ్వకుండా జనగామ, ఆలేరు, యాదగిరి గుట్టలో ఉన్నటువంటి నాలుగు ప్లాట్లను కంపెనీ పేర మార్ట్‌ గేజ్‌ చేసుకొని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది అక్షరకంపెనీ, దీంతో సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సకాలంలో కేసునమోదు చేయకపోవడంతో బాధితులు డిజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్‌ డీ జీపీ నాగిరెడ్డిలను ఆశ్రయించారు. అప్పట్లో ఉన్నటువంటి సీపీ ప్రమోద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లడంతో చిట్‌ ఫండ్‌ కంపెనీలపై ఆరా తీసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత వ చ్చినటువంటి సీపీ తరుణ్‌జోషిని కూడా బాధితులు కలవడంతో కేసును వేగవంతం చేశారు. పోలీసుల ఒత్తిళ్ళతో పేరాల శ్రీనివాస్‌రావుపై సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఆర్‌ఆ కావడంతో అరెస్టు అయి జైలుకు వెళ్లారు.

ఖాతాదారులపై బెదిరింపులు
అక్షర చైర్మన్‌ జైలుకు పోయివచ్చినా.. ఆయన బుద్ది మారడంలేదు. ఖాతాదారులను బెదిరింపులకు గురిచేస్తూ భయబ్రాంతులకు పాల్పడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఒక వైపున పోలీసుల ఒత్తిళ్ళు ఉన్నప్పటికి చిట్‌ ఫండ్‌ కంపెనీల నిర్వాహకులు తమ పద్దతులను మార్చుకోవడంలేదని విమర్శలు పెద్దఎత్తున ఉన్నాయి. చిట్‌ ఫండ్‌ కంపెనీల్లో అరుణకొండారెడ్డి లాంటి బాధితులువేలాది మంది చిట్‌ఫండ్‌ కంపెనీల చుట్టు చిట్టీలు పూర్తయిన తర్వాత డబ్బుల కోసం తిరుగుతున్నారు. కానీ చిట్‌ ఫండ్‌ కంపెనీల యాజమానులు మాత్రం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పాతుకపోయారు. ఖాతాదారుల డబ్బులతో కోట్లకు పడగలెత్తారు. డబ్బుల కోసం వచ్చే బాధితులను మాఫియాను అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చిట్‌ఫండ్‌ కంపెనీలు చేస్తున్న మోసాలపై చర్యలు తీసుకొని కట్టడి చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement