Tuesday, May 14, 2024

Agri: యాసంగిలో శ‌న‌గ‌, వేరు శ‌న‌గ పంట‌లు.. మిల్లెట్స్‌ సాగు అంతంత మాత్రమే..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: యాసంగిలో వేరుశనగ, శనగ పంటల సాగు జోరందుకుంది. సీజన్‌లో అత్యధికంగా సాగవుతున్న పంటల్లో ఈ రెండు పంటలే అధిక విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ మేరకు వేరుశనగ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 1.72 లక్షల్లోనే సాగైంది. ప్రస్తుతం ఇప్పటివరకు 2.93లక్షల ఎకరాల్లో సాగైంది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా, ఈయేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8.93లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్లు- వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ద్వారా స్పష్టం కాగా ఇప్పటి వరకు యాసంగిలో పంటలు 19శాతంగా నమోదయ్యాయి. యాసంగిలో పప్పు శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, నిరుడు 2.59లక్షల ఎకరా ల్లో సాగైంది. ప్రస్తుతం 2.81లక్షల ఎకరాల్లో సాగైంది. వేరు శనగ, పప్పుశనగ, మినుములు పంటలు ఈయాసంగిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నాయి.

నామమాత్రంగానే చిరుధాన్యాలు..
ఈ సీజన్‌లో చిరుధాన్యాల సాగు అంతంత మాత్రం గానే సాగుతుంది. మొక్కజొన్న 1.15లక్షల ఎకరాల్లో, జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 75,274 ఎకరాలు కాగా, ఇప్ప టివరకు 29,545 ఎకరాల్లో సాగైంది. మిను ములు 57వేల ఎకరాల్లో, సజ్జలు 22,967 ఎకరాలకు కేవలం 104 ఎకరా ల్లోనే సాగైంది. రాగులు 490 ఎకరాలు, కొర్రలు 203 ఎకరా లు, మిగతా మిల్లెట్స్‌ 109 ఎకరాల్లో మాత్రమే సాగయ్యా యి. పెసర సాధారణ సాగు విస్తీర్ణం 21,488 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9,516 ఎకరాల్లో సాగైంది.పొద్దు తిరుగుడు సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 9,945 ఎకరాల్లో సాగైంది. ఈయేడు యాసంగిలో వరి సాగు వద్దన్నా ఇప్పటి వరకు 13వేల ఎకరాల్లో నాట్లు- పడడం గమనార్హం. యాసంగి సాధారణ సాగు 31.01లక్షల ఎకరాలు కాగా నిరుడు యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈయేడు ఇప్పటికే 13వేల ఎకరాల్లో నాట్లు- పడ్డాయి.

నాగర్‌ కర్నూల్‌లో అధిక విస్తీర్ణంలో సాగు..
అత్యధికంగా యాసంగి పంటలు నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 1,57,694 ఎకరాల్లో సాగుకాగా, నిజామాబాద్‌లో 94,270, కామారెడ్డిలో 81,823, ఆదిలాబాద్‌లో 77,273, నిర్మల్‌లో 78,546, వనపర్తి జిల్లాలో 57,983, వికారాబాద్‌ జిల్లాలో 48574 ఎకరాల్లో సాగయ్యాయి. యాదాద్రి, పెద్దపల్లి జిల్లాలో ఒకశాతం పంటలే వేయగా, సూర్యాపేట, కరీంనగర్‌ ,రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జయశంకర్‌ భూపాలపల్లిలో, మెదక్‌ జిల్లాల్లో కేవలం 2 శాతం చొప్పున మాత్రమే యాసంగి పంటలు సాగయ్యాయి. ములుగు 6శాతం, నల్గొండ, ఖమ్మం, జనగామలో 8శాతం మేరకే పంటలు సాగయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement