Sunday, May 5, 2024

Yadadri Temple: సీఎం కేసీఆర్ పై హీరో బాలకృష్ణ ప్రశంసలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు.‘అఖండ’ సినిమా బాక్ బాస్టర్ హిట్ కావడంతో హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలల్లోని పలు పుణ్యక్షేత్రలను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని బాలయ్య దర్శించారు.

ఈ సంరద్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. యాదాద్రి ఒక అద్భుతమని అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని చెప్పారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉందన్న బాలయ్య.. ఇలాంటి అభివృద్ది పనులను ఎవరు చేసినా అభినందించాలని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement