Saturday, April 20, 2024

గోవా ఎన్నికలకు ఆమ్ ఆద్మీ రెడీ.. 10 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్..

గోవాలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రం తన తొలి జాబితాను ఈ రోజు (శుక్రవారం) ప్రకటించింది. కాగా ఈ లిస్టులో 10 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. కాగా, వీరిలో బీజీపీ మాజీ మంత్రి పేరు ఫస్ట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి చెందిన మాజీ మంత్రులు మహదేవ్ నాయక్, అలీనా సల్దాన్హాతో పాటు న్యాయవాది, పొలిటీషన్ అయిన అమిత్ పాలేకర్ పేర్లు ఉన్నాయి. ఉత్తర గోవా, దక్షిణ గోవా జిల్లాలు రెండింటిలోనూ విస్తరించి ఉన్న 10 మంది అబ్యర్థుల జాబితాను ఆప్ రాష్ట్ర ఇన్ చార్జి అతిషి ఆమోదించారు. గోవా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా.. ఇప్పుడు రెండో పార్టీగా ఢిల్లీకి చెందిన ఆఫ్ అవతరించింది. కాంగ్రెస్ తొలి జాబితాలో 10 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు.

ఆప్ అబ్యర్థుల్లో పాలేకర్ సెయింట్ క్రూజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, గతంలో బీజేపీలో ఉన్న విశ్వజిత్ కృష్ణారావు రాణే పోరియం నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ మాజీ మంత్రి శ్రీ నాయక్ శిరోడా నుంచి పోటీ చేయనుండగా, ఆప్ నేత సత్యవిజయ్ నాయక్ వాల్పోయి నుంచి పోటీ చేయనున్నారు. గతంలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)లో ఉన్న ప్రేమానంద్ నానోస్కర్ దబోలిమ్ నుండి AAP అభ్యర్థిగా ఉన్నారు. గత నెలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీలో చేరిన బీజేపీ మాజీ మంత్రి సల్దాన్హా కోర్టాలిమ్ స్థానం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement