Thursday, April 25, 2024

ఎల‌క్ష‌న్స్ జ‌రిగే రాష్ట్రాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి – ప్ర‌శాంత్ కిషోర్

ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో క‌నీసం 80శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించాల‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తెలిపారు. క‌రోనా కేసులు పెరుగుతున్న త‌రుణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఇంత‌కంటే సుర‌క్షిత మార్గం లేద‌ని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించ‌క‌పోతే ప్ర‌క్రియ మొత్తం ప్ర‌హ‌స‌నంగా మారుతుంద‌ని పీకే తెలిపారు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్, పంజాబ్, మ‌ణిపూర్, గోవా,ఉత్త‌రాఖండ్ ల‌లో ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల సంఘం కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించే తేదీల‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఈ మేర‌కు క‌రోనా ప‌రిస్థితిపై ఈసీకి కేంద్రం నిన్న వివరాల‌ను అందించిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement