Thursday, April 25, 2024

75 ఏళ్ల భారతం.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. ఎల్లుండి స్పెషల్ ప్రోగ్రామ్

ప్ర‌భ‌న్యూస్: స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతి, మనదేశ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి టీవీ ఛానెళ్లు, ఆన్‌లైన్‌ పోర్టళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం అనంతరం ఆయనతో కలిసి కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ సామాన్య ప్రజలతో సహా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వివిధ సంస్థలు, బార్‌ కౌన్సిళ్లు తదితర రంగాలకు చెందినవారు తమ తమ ప్రాంతాల నుంచి రాజ్యాంగ పీఠికను చదువుతారు. రాష్ట్రపతితో కలిసి రాజ్యాంగ పీఠిక చదవడానికి వివిధ రంగాలకు చెందిన వారు ముందుకు రావాలని జోషి పిలుపునిచ్చారు.

పెద్దసంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రెండు పోర్లళ్లను అభివృద్ధి చేసింది. 22 అధికారిక భాషలు, ఇంగ్లిష్‌ సహా 23 భాషల్లో రాజ్యాంగ పీఠిక ఆన్‌లైన్‌ పఠనం, రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్‌ క్విజ్‌లలో mpa.nic.in/constitution-day ద్వారా ఎవరైనా, ఎక్కణ్నుంచైనా పాల్గొని సర్టిఫికెట్‌లను పొందవచ్చునని మంత్రి వివరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహిత జై ప్రకాష్‌ లఖివాల్‌ ఈ పోర్టల్‌లోని పీఠిక కోసం ఫ్రేమ్‌ను రూపొందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా దీన్ని తయారు చేశారు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్‌ క్విజ్‌ పోర్టల్‌ను రాష్ట్రపతి ఈనెల 26న సెంట్రల్‌ హాల్లో ప్రారంభిస్తారు. క్విజ్‌ను డిజిటల్‌ విధానంలో సులువైన ప్రశ్నలతో రూపొందించారు. ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

క్విజ్‌లో పాల్గొనే వారి పేరు, టెలిఫోన్‌ నంబర్‌, వయస్సు వివరాలను పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. వెయ్యి ప్రశ్నలతో కూడిన క్వశ్చన్‌ బ్యాంక్‌ కూడా అందుబాటులో ఉంటుంది. భారత రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం,ప్రాథమిక విలువలను ప్రాచుర్యంలోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో నిర్వ#హస్తున్న ఈ క్విజ్‌లో పాల్గొన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్లను అందిస్తుంది. 2010లో నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంవిధాన్‌ గౌరవ్‌ యాత్రను తొలిసారిగా నిర్వ#హంచారని ఈ సందర్భంగా మంత్రి ప్రహ్లాద్‌ జోషి గుర్తు చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని జాతీయ కార్యక్రమంగా గుర్తించి ఇందులో పాల్గొని సర్టిఫికెట్లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని మంత్రి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement