Thursday, May 16, 2024

63ఏళ్ల‌కి మ‌రోసారి తండ్రి కానున్న – హాలీవుడ్ న‌టుడు, నిర్మాత‌

63ఏళ్ల‌కి మ‌రోసారి తండ్రి కానున్నాడు హాలీవుడ్ నటుడు, నిర్మాత అలెక్ బాల్డ్విన్. ఈ మేర‌కు త‌న కుటుంబంలోకి కొత్త అతిథి రానున్న‌ట్లు వెల్ల‌డించాడు. కాగా తనకంటే 25 ఏళ్ల చిన్నదైన అమెరికన్ యోగా ట్రైనర్ హిలేరియాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఆరుగురు సంతానం ఉన్నారు. కొత్త అతిథితో తమ కుటుంబం సంపూర్ణమవుతుందని అనుకుంటున్నామని ఈ సందర్భంగా హిలేరియా సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించింది. తాము ఎంతో సంతోషంలో ఉన్నామని చెప్పింది. అలెక్ మిషన్ ఇంపాజిబుల్, రస్ట్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో అలరించాడు. గత కొన్నేళ్లుగా ఈ నటుడు ఒక వివాదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒక సినిమా షూటింగ్ లో గన్ తో ఒక నటుడిని కాల్చి చంపాడు. దర్శకుడిని గాయపరిచాడు. ఈ ఘటన అప్పట్లో హాలీవుడ్ లో పెను సంచలనాన్ని రేకెత్తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement