Saturday, July 27, 2024

Apple IPhone: ఆపిల్ నుంచి బడ్జెట్ లో 5జీ ఫోన్.. 22 వేలతో అందుబాటులోకి..

ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫొన్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. దాన్ని చేతిలో ప‌ట్టుకుని స్టేట‌స్‌గా కూడా ఫీల్ అవుతుంటారు. అయితే అన్ని కంపెనీల ఫోన్ల కంటే ఆపిల్ ఐఫోన్ చాలా ఖ‌రీదు ఉంటాయి. అందుకే సామాన్యులు దీన్ని కొన‌డానికి కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. అయితే బడ్జెట్​ ధరలో ఐఫోన్ కొనాల‌నుకునే వారికి సంస్థ గుడ్ న్యూస్ చెబుతోంది. బఢ్జెట్ సెగ్మెంట్​లో తీసుకొచ్చే ఎస్​ఈ మోడల్స్ లో కొత్త ఫోన్​ విడుదలపై కసరత్తు చేస్తోంది. ఐఫోన్​ ఎస్ఈ3 (2022) పేరుతో మార్కెట్లోకి విడుదల కానుంది.

అయితే ప్రొడక్షన్​ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురైతే విడుదల తేదీని ఇంకాస్త ముందుకు జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమచారం ప్రకారం.. మార్చి ఫ్రారంభంలోనే ఈ కొత్త మోడల్​ రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. 2020 తర్వాత వస్తున్న ఎస్​ఈ మోడల్ ఇదే కావడం గమనార్హం.

ఎస్​ఈ3 మోడ‌ల్ ప్ర‌త్యేక‌త‌లు..
ఐఫోన్‌ ఎస్​ఈ3ని పూర్తిస్థాయి అప్​డేటెడ్ వెర్షన్​గా విడుదల చేస్తోంది యాపిల్ కంపెనీ. ఇక ఈ మోడల్​ 5జీతో అందుబాటులోకి రానున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఫోన్​ చూసేందుకు ఎస్​ఈ2 మాదిరిగానే ఉండొచ్చు అంటున్నారు టెక్ అన‌లిస్టులు. కెమెరా, ప్రాసెసర్​ విషయంలోనూ భారీగా మార్పులు చేసినట్లు సమాచారం. యాపిల్​ సొంత చిప్​సెట్​ అయిన .. ఏ15 బయోనిక్​ చిప్​తో ఎస్ఈ​3 రానుంది. 3జీబీ ర్యామ్​తో ఈ ఫోన్​ అందుబాటులోకి వచ్చే అవకాశలున్నాయి.

ఐఫోన్ ఎస్​3 ధర దాదాపు 300 డాలర్లు అంటే.. రూ.22,500గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్‌.. అయితే ఐపోన్ ఎస్​ఈ3 విడుదల తేదీపై యాపిల్​ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement