Saturday, May 18, 2024

జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై 590పేజీల‌తో నివేదిక‌-సీఎం స్టాలిన్ కి అంద‌జేసిన అరుముఘ‌స్వామి క‌మిష‌న్

సీఎం స్టాలిన్ కి త‌మిళనాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌ మృతిపై రిటైర్డ్ జ‌డ్జి అరుముఘ‌స్వామి క‌మిష‌న్ త‌న రిపోర్ట్‌ను స‌మ‌ర్పించింది. 590 పేజీల‌తో ఆ నివేదిక త‌యార‌యింది. జ‌యల‌లిత‌ మృతిచెందిన ఐదేళ్ల‌ త‌ర్వాత ఆమె మృతి రిపోర్ట్‌ను పూర్తి చేశారు. గ‌తంలో ఉన్న అన్నాడీఎంకే ప్ర‌భుత్వం జ‌య మ‌ర‌ణంపై అరుముఘ‌స్వామి క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. 2017, న‌వంబ‌ర్ 22న ఆ క‌మిష‌న్ ద‌ర్యాప్తును ప్రారంభించింది. జ‌స్టిస్ అరుముఘ‌స్వామి మ‌ద్రాసు హైకోర్టులో జ‌డ్జిగా చేసి రిటైర్ అయ్యారు. జ‌యల‌లిత‌ మృతికి దారితీసిన కార‌ణాల‌ను క‌మిష‌న్ త‌న రిపోర్ట్‌లో పొందుప‌రిచింది. ఈ విచార‌ణ‌లో భాగంగా అరుముఘ‌స్వామి క‌మిష‌న్ సుమారు రెండు వంద‌ల మందిని ప్ర‌శ్నించింది. 158 మంది సాక్ష్యుల‌ను, పిటిషీన‌ర్లను విచారించిన‌ట్లు అరుముగ‌స్వామి తెలిపారు. విచార‌ణ‌ను సాగ‌దీసిన‌ట్లు కొంద‌రు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే తాను చేప‌ట్టిన ద‌ర్యాప్తు నివేదిక‌ను రిలీజ్ చేయాలా వ‌ద్దా అన్న అంశాన్ని ప్ర‌భుత్వ‌మే తీసుకోవాల‌న్నారు. విచార‌ణ స‌మ‌యంలో అపోలో హాస్పిట‌ల్‌, శ‌శిక‌ళ స‌హ‌క‌రించిన‌ట్లు రిటైర్డ్ జ‌డ్జి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement