Friday, May 3, 2024

భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ ..మీ ఎదురు చూపులు తగ్గ ఫ‌లితం ఉంటుంది-హ‌రీశ్ శంక‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ తెర‌కెక్కిస్తున్న భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెంస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అభిమానుల ట్వీట్లకు రిప్లై ఇచ్చే నేపథ్యంలోనే.. ఓ అభిమానికి తన స్టైల్‌ లో ఆన్సర్‌ ఇచ్చాడు హరీష్‌. ఆ స్టైలు, స్వాగ్‌, ఏమైపోయాయ్‌ కళ్యాణ్‌ అన్నా. హరీష్‌ శంకర్‌ అన్నా మళ్లీ నీ వల్లే అవుతుంది ఇవన్నీ… నీ సినిమాతోనే లాస్ట్‌ అనిపిస్తుంది అంటూ ఓ ఫ్యాన్‌ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించారు హరీష్‌ శంకర్‌. అన్నీ ఉంటాయ్‌.. ఏదీ మిస్‌ అవ్వదు… మీ ఎదురు చూపులకు తగ్గ ప్రతి ఫలం వస్తుంది నన్ను నమ్మండి అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.మ‌రి హ‌రీశ్ శంక‌ర్ ఫ్యాన్స్ న‌మ్మ‌కాన్ని ఏ మేర‌కు నిల‌బెడ‌తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement