Saturday, September 21, 2024

40 ఏళ్ల క్రితం సైకిల్ పై తిరుగుతూ పాలు, పూలు అమ్మేవాడిని – మంత్రి మ‌ల్లారెడ్డి

క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది ఏదీ లేద‌న్నారు మంత్రి మ‌ల్లారెడ్డి.తాను 40 ఏళ్ల క్రితం సైకిల్ పై తిరుగుతూ పాలు, పూలు అమ్మేవాడిన‌ని అన్నారు. ఇప్పుడు త‌న కాలేజీలు దేశంలోనే టాప్ 10 స్థానాల్లో ఉన్నాయ‌ని చెప్పారు. హైద‌రాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వ‌హించిన‌ మేడే వేడుకల‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కార్మికుడి దుస్తుల్లో వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ… త‌న క‌ష్టార్జితంతోనే తాను ఇన్ని కాలేజీలు స్థాపించాన‌ని అన్నారు. సండే, మండే అనే తేడాలు లేకుండా తాను క‌ష్ట‌ప‌డుతున్నాను కాబ‌ట్టే ఈ స్థాయిలో ఉన్నాన‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ వ‌ల్ల కార్మికులు క‌ష్టానికి త‌గిన ఫ‌లితం పొందుతున్నార‌న్నారు. కార్మికుల పిల్ల‌ల కోసం సీఎం కేసీఆర్ గురుకులాల‌ను ఏర్పాటు చేశార‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement