Friday, May 3, 2024

40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలి.. TS బీసీ కమిషన్ సభ్యులు

కేంద్ర ఓబీసీ జాబితాలో తెలంగాణకు చెందిన 40 బీసీ కులాలు కలపాలని జాతీయ బీసీ కమిషన్ కు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) కార్యాలయంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ నుంచి కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవటం వల్ల సామాజిక వర్గాలు చాలా బీద కులాల కుటుంబాలకు చెందిన బిడ్డలు కేంద్రంలో విద్య పరంగా, ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు ఫలాలు కోల్పోతున్నారని చెప్పారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలుగా గుర్తించిన కులాలను కూడా కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం తీవ్ర అన్యాయమన్నారు.

ప్రభుత్వాలు మారుతున్నా బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంలో ముందడుగు పడటం లేదన్నారు. గత ఏడాది డిసెంబర్ లో జాతీయ బీసీ కమిషన్ కులాలపై విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర బీసీ కమిషన్ వెనుకబడిన కులాలపై లోతుగా అధ్యయనం చేసి వారి స్థితిగతులను తెలుసుకొని నివేదిక అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో బీసీ కులాలుగా గుర్తింపు ఉన్న అన్ని కులాలను పరిశీలించి వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. తక్షణమే జాతీయ బీసీ కమిషన్ వెంటనే స్పందించి వెనుబడిన 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ కోరారు.


జనగణనలో కులగణన చేపట్టాలి – రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబోయే జనగణనలో కులగణన చేపట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ కోరారు. ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీసీ కులాల జనాభా లెక్కలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే జనగణనలో కుల ప్రాతిపదికన వివరాలు సేకరించాలంటూ అన్ని రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోందన్నారు. ఏపీ, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు ఈ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు. కులగణన దేశవ్యాప్తంగా బీసీలకు ఉపయోగపడుతుందని కిషోర్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement