Wednesday, May 15, 2024

3కే రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన -సెబ్ అడిషనల్ ఎస్పీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3 కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 3 కే రన్ కార్యక్రమాన్ని సెబ్ అడిషనల్ ఎస్పీ తుహీన్ సిన్హా ఐపియస్ జెండా ఊపి ప్రారంభించారు. 3కే రన్ నగరంలోని కొండారెడ్డి బురుజు నుండి రాజ్ విహార్ కూడలి వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో కె వి ఆర్ కళాశాల విద్యార్థులు, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినిలకు అడిషనల్ ఎస్పీ ప్రశంస పత్రాలను అందజేశారు. సెబ్ అడిషనల్ ఎస్పీ తుహీన్ సిన్హా ఐపియస్ మాట్లాడారు.. మహిళల భద్రత కోసం పోలీసులు 24×7 ఎల్లప్పుడు అందూబాటులో ఉంటున్నార్నారు. సత్వరమే స్పందిస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహిళల ప్రాధాన్యత, మహిళా సాధికారత గురించి తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలన్నారు. ఆత్మకూరు డిఎస్పీ శృతి మాట్లాడారు.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలకు ఏమైనా సమస్యలుంటే దిశా పోలీసుస్టేషన్, దిశ SOS యాప్ తో పోలీసుల నుండి రక్షణ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రమణ, నాగబాబు, డిఎస్పీలు శృతి, మహేష్, పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, దిశా పోలీసుస్టేషన్ సిఐ సుగుణ కుమారి, ఆర్ ఐలు వి.యస్ రమణ, సుధాకర్, శివారెడ్డి, ఎస్సైలు, దిశా మహిళా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement