Thursday, July 11, 2024

Delhi | మైనర్​ బాలికపై లైంగిక దాడి.. వీడియో వైరల్, నిందితుడి అరెస్ట్​!​

ఓ అబ్బాయి, అమ్మాయికి సంబంధించిన సీక్రెట్​ వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.  ఇది ఢిల్లీలోని సుల్తాన్‌పురి ఏరియాకు చెందన వారిదిగా గుర్తించారు. ఈ వీడియోలో 27 ఏళ్ల వ్యక్తి.. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. కాగా, గుర్తు తెలియని వ్యక్తి చిత్రీకరించిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వీడియోలో నఫీల్ అహ్మద్‌గా గుర్తించిన వ్యక్తి, బాలికపై దాడి చేసి, “ఆమె నాతో ఉంది” అని చెప్పాడం కనిపిస్తోంది.

కాగా, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన పాఠశాల యూనిఫాంలో ఆ వీడియోలో కనిపించింది. ఈ ఎపిసోడ్‌ పై బాలికపై దాడిచేసిన అహ్మద్‌ను ప్రశ్నించడంతో తన చర్యలను సమర్థించుకున్నాడు. వీరిద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తేలింది. అయితే.. బాలిక తల్లి నుండి అనేక అభ్యంతరాలు వచ్చిన తర్వాత కూడా, అహ్మద్ సమీపంలోని పార్క్ లో బాలికను రహస్యంగా కలుస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక.. బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు 354, 354D కింద కేసు నమోదు చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. నిందితుడు అహ్మద్​ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement