Saturday, April 20, 2024

TS | నాడు ఉద్యమించిన వాళ్లే.. నేడు హారతులు పడుతున్నారు: మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

విద్యుత్ కోతలకు వ్యతిరేఖంగా ఉద్యమించిన వారే నేడు హారతులు పడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అదే విద్యుత్ శాఖా సాధించిన విజయాలకు సంకేతమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో విద్యుత్ విజయాలపై నిర్వహించిన విద్యుత్ ప్రగతి సభకు జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి ఆలోచనలకు చిక్కని వ్యక్తి అని, ఆయన విజన్ ను అందుకోవడం అంత సులభం కాదన్నారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే చిమ్మటి చీకట్లు తెలంగాణలో అలుముకుంటాయ‌ని అపోహలను పటాపంచలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేన‌న్నారు. దానికి తోడు ప్రపంచం మొత్తం పారిశ్రామిక వేత్తలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతుంటే సమైక్యాంధ్రలో పవర్ హాలిడేస్ తో పారిశ్రామిక వేత్తలు రోడ్డున పడ్డ దుస్థితి నుండి గడిచిన తొమ్మిదేళ్ల వ్యవదిలో 50 వేల పరిశ్రమలు స్థాపన జరగడమే స్వరాష్ట్రంలో విద్యుత్ శాఖా సాధించిన విజయాలు అని ఆయన స్పష్టం చేశారు.

రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న,ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు, జె యం డి శ్రీనివాసరావు, టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి, టి ఎస్ ఎన్ పి డి సి ఎల్ సి యం డి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement