Friday, May 3, 2024

FLASH: కార్మికులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

భద్రాచలం జిల్లా కొత్తగూండెం పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాధితులను సర్వేష్‌, సరోజగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement