Saturday, April 20, 2024

Gold Rate: మహిళలకు షాక్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర

పసిడి ప్రియులకు షాక్. నిన్న తగ్గిన బంగారం ధరల నేడు పెరిగింది. అక్షయ తృతీయ దగ్గర పడుతుండటంతో మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. శనివారం మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.48,550కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరుగుదలతో రూ.52,960కి చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,200కి ఎగసింది. కాగా, గత కొద్ది రోజులుగా వెండి ధర భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement